​యుఈ జువెలరీ ఎక్స్ పో

319
- Advertisement -

భారతదేశపు సమకాలీన, వినూత్న ఆవిష్కరణల ఆభరణాల ఎగ్జిబిషన్, యుఈ ద జువెలరీ ఎక్స్పో 40వ సంచిక  హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్లో సెప్టెంబర్ 8 నుంచి 11, 2016 వరకూ మూడు రోజుల పాటు జరుగనుంది. ఈ ఎగ్జిబిషన్‌ను భారతదేశ వ్యాప్తంగా ఆభరణాల ప్రదర్శనలో పేరెన్నికగన్న చెన్నయ్‌కి చెందిన యునైటెడ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తుంది.

హైదరాబాద్లో ఆభరణ ప్రదర్శన ప్రమాణాలను యుఈ ద జవెలరీఎక్స్ పో పునర్విచించనుంది. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి విచ్చేసిన 85 మంది ఎగ్జిబిటర్లు ప్రదర్శించే వినూత్న డిజైన్స్‌ను వీక్షించే అవకాశం నగరవాసులకు ఈ ప్రదర్శన కల్పిస్తుంది.

Taj krishna

మూడు రోజుల ప్రదర్శనలో సందర్శకులు గాజులు, రింగులు, నెక్లెస్లు, ఇయర్ రింగ్స్, పెండెంట్స్, టైడల్ కలెక్షన్స్, మెన్స్ కలెక్షన్స్, చైన్స్ మరియు బంగారు, వజ్రాలు,యాంటిక్ కస్టమ్, ఫ్యాషన్, హ్యాండ్ మేడ్, కుందన్ మీనాకారీ, నవరత్న పచ్చికమ్, సిల్వర్, స్టోన్ జువెలరీ యాక్ట్ససరీలను కూడా కొనుగోలు చేయవచ్చు హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, చెన్నయ్, బెంగళూరు, సికింద్రాబాద్, సూరత్ తదితర ప్రాంతాలకు చెందిన అగ్రశ్రేణి జవెలరీ బ్రాండ్లు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించనున్నాయి.

ఈ జవెలర్స్ తమ ఫ్యాషన్, డైమండ్, గోల్డ్, హ్యాండ్ మేడ్, జాదూ, కుందన్, టెంపుల్ జువెలరీతోపాటుగా వాచెస్, నెగాస్వర్క్తో కూడిన ఆభరణాలు, ఇటాలియన్, టర్కిష్ ఆభరణాలు, కన్వర్టబుల్ జువెలరీ, టైక్లిప్స్ వంటి పె ఎంటెబులరీ యాక్ససరీలను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనలో ఫ్రెంచ్ ఎనామలింగ్‌తో కూడిన బంగారు ఆభరణాలు. ప్లేటెడ్ జువెలరీ వంటివి ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.

taj krishna

ఈ ప్రదర్శన గురించి ప్రాజెక్ట్ డైరెక్టర్ వీకె మనోజ్ మాట్లాడుతూ ‘హైదరాబాద్లో మా ఫ్లాగ్ షిప్ బ్రాండ్‌ను తీసుకురావడం పట్ల చాలా ఆనందంగా ఉన్నాం. గతంలో జరిగిన ప్రదర్శనల కన్నా చాలా పెద్దగా ఈసారి ఎగ్జిబిషన్ ఉంటుంది. నేడు హైదరాబాద్లో అతిపెద్ద ఆభరణాల ప్రదర్శనగా ఇది నిలుస్తుందన్నారు. పూర్తి ఉచితంగా ఈ ఎగ్జిబిషన్‌కు ప్రవేశం కల్పిస్తున్నామని…ఎగ్జిబిషన్‌లోని ఆయా స్టాల్స్లో ప్రత్యేక రాయితీలను సైతం అందించనున్నారు” అని తెలిపారు.

- Advertisement -