అసలాట ఇప్పుడే మొదలైంది..!

315
Janatha Garage box office: 5 records Jr NTR, Mohanlal film broke
Janatha Garage box office: 5 records Jr NTR, Mohanlal film broke
- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో వరుసగా రెండు హిట్స్ సాధించిన యంగ్ టైగర్ ఎన్టీర్..దర్శకుడిగా వరుస రెండు హిట్లు సాధించిన కొరటాల శివ మరో హ్యాట్రిక్ కొట్టాలన్న తాపత్రయంతో తీసిన చిత్రం ‘జనగా గ్యారేజ్’. అనుకున్నట్లుగానే ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తో ముందుకు దూసుకు వెళ్తుంది. అయితే ప్రీమియం షో చూసిని కొంత మంది ఈ చిత్రం యావరేజ్ అని చెప్పినటప్పటికీ థియేటర్లో టాక్ మరోలా వచ్చింది. దీంతో ఈ సినిమాపై పెట్టుకున్న ఆశలు వమ్ముకాలేదని చిత్ర యూనిట్ భావిస్తుంది.

మోహన్‌లాల్, ఎన్టీఆర్ కలయికలో వచ్చిన జనతాగ్యారేజ్ ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూటర్లకు కనకవర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న ఈ సినిమా ఓవర్సీస్‌లో మాత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. మొత్తంగా ఓవర్సీస్‌లో కూడా తనకు స్టామినా ఉందని ఎన్టీఆర్ ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. విడుదలయిన మొదటి నాలుగు రోజుల్లోనే 1.43 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. మొదటి రోజు తక్కువ కలెక్ట్ చేసి.. ఆ తర్వాత రోజు నుంచి మౌత్ టాక్‌తో కలెక్షన్లు పుంజుకున్నాయని వారు చెబుతున్నారు. జనతా గ్యారేజ్‌కు ఓవర్సీస్‌లో వచ్చిన మొదటి నాలుగు రోజుల కలెక్షన్లు ఇవీ..

గురువారం——– 154వేల డాలర్లు
శుక్రవారం——– 216వేల డాలర్లు
శనివారం——– 280 వేల డాలర్లు
ఆదివారం——– 197 వేల డాలర్లు

మొత్తంగా 1.43 మిలియన్ డాలర్లను నాలుగు రోజుల్లోనే కలెక్ట్ చేసి ఓవర్సీస్‌లో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్.

- Advertisement -