సురాజ్ దర్శరత్వంలో మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. విశాల్ సరసన తమన్నా కథానాయికగా నటిస్తోంది.
ఈ సినిమాలో ఓ భారీ ఫైట్ కోసం ఫైట్ మాస్టర్ కనల్‌కణ్ణన్ సారథ్యంలో కోటిన్నర రూపాయల వ్యయంతో ఓ ఛేజ్‌ని షూట్ చేశారు. ఇవేకాక విశాల్, తమన్నాలపై శోభి నృత్య దర్శకత్వంలో భారీ సెట్స్ వేసి కోటి రూపాయల వ్యయంతో ఓ పాట తీశారు. పాండిచ్చేరిలో భారీ సెట్స్ వేసి దినేష్ నృత్యదర్శకత్వంలో హీరో విశాల్ ఇంట్రడక్షన్ సాంగ్‌ని చాలా లావిష్‌గా చిత్రీకరించారు.
ఈ చిత్రానికి సంబంధించి తొలి టీజర్ ఆగస్ట్ 29న విశాల్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేయనున్నారు. అక్టోబర్ 9న ఆడియో, అక్టోబర్ 29న వరల్డ్‌వైడ్‌గా సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రైమ్‌స్టార్ జగపతిబాబు విలన్‌గా నటిస్తుండగా సంపత్‌రాజ్, చరణ్, జయప్రకాష్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ‘ఒక్కడొచ్చాడు’ సినిమాకు హిప్ ఆప్ సంగీతం అందించగా ఇది సినిమాకు మరింత ప్లస్ కానుందని నిర్మాతలు చెబుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రీ టీజర్ రిలీజ్ చేశారు.