రక్తం పంచుకుపుట్టిన బిడ్డనే…

231
Bareilly woman beats up her one-year-old child
Bareilly woman beats up her one-year-old child
- Advertisement -

సృష్టిలో కరగనిది తరగనిది, మరెందులోనూ కనిపించనిది, భూమి కన్నా విశాలమయినది, చందమామ కన్నా చల్లనయినది, సూర్యుని కన్నా ప్రకాశవంతమయినది, ఆప్యాయత అనురాగాల గొప్ప నిధి
అదే తల్లి ప్రేమ..  

ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే.. అది తల్లిప్రేమే. తన ప్రాణాలను పణంగా పెట్టైనా సరే బిడ్డ ప్రాణాలను కాపాడుతుంది తల్లి.

ఎవరూ రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరూ అమ్మ అను రాగం కన్నా తియ్యని రాగం.. అని అన్నాడొక సినీ కవి. ఈ ఒక్క పాట చాలు విశ్వంలో మాతృమూర్తికున్న అత్యున్నత స్థానాన్ని తెలియపరచడానికి. ఈ ప్రకృతిలో సృష్టించబడుతున్న జన్మల కన్నా మానవ జన్మ ఎంతో మిన్న. అటువంటి మానవ జన్మకే జన్మను ప్రసాదించిన అమ్మ ఎంతో గొప్పది.

Bareilly woman beats up her one-year-old child

అసలు స్ర్తీకి తల్లిగా మారాకనే సంపూర్ణత్వం వస్తుంది. మానసిక, శారీరక పరిణతి అనేది తను ఒక అమ్మగా గుర్తింపు పొందిన తర్వాతే వస్తుంది. ఎంత సంపాదిం చినా… ఎన్ని ఆభర ణాలున్నా వెలకట్టలేనిది. సృష్టిలో తీయనైనది అమ్మతనం.తాను తల్లిగా గర్భం ధరించానని గుర్తించిన తొలినాళ్ళ నుంచి బిడ్డని కని చేతిలోకి తీసుకునే దాకా తల్లి పడే ఆ ఆరాటం, ఆ ఆనందం… మాటల్లో వర్ణించేందుకు సాధ్యం కాదు. తనని కన్న వారిని, తనని కట్టుకున్న వారిని, తనతో పుట్టిన వారిని… అందర్నీ మరపించేది మాతృత్వం.ఆ మాతృత్వం స్ర్తీని తల్లిగా మార్చేస్తుంది.

Bareilly woman beats up her one-year-old child

మనిషికి మానవత్వం.. మనసుకి మాధుర్యం ఉంటే వాటి రుచి చూసిన రెండు మనసుల మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇలాంటి ప్రేమలు ఎన్నో ఉన్నా తన బిడ్డపై తల్లి చూపించే ప్రేమ ఈ ప్రపంచం.. కాదు.. కాదు…ఈ విశ్వంలోనే మొట్టమొదటిది.. అపూర్వమైనది.. శాశ్వతమైనది.. ఈ ప్రేమకి మరే ప్రేమ సాటి రాదు.. సాటి లేదు.. ఇకపై రాదు కూడా..

కానీ.. ఉత్తర్ ప్రదేశ్ లో బరేలీలో ఓ తల్లి కసాయిగా మారింది. కన్నబిడ్డనే గొడ్డును బాదినట్టు బాదింది. పసివాడనే దయ కూడా లేకుండా క్రూరంగా ప్రవర్తించింది. పసివాడికి పాలు ఇవ్వకుండా.. అన్నం తినిపించకుండా చిత్రహింసలు పెట్టింది. చిన్న పిల్లలు కాసేపు ఏడిస్తేనే తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. కానీ ఈమెకు మాత్రం పసివాడి ఏడుపు వినందే నిద్రపట్టదు. భర్త ఆఫీసుకు వెళ్లినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు నిత్యం కొడుతూనే ఉండేది.

Bareilly woman beats up her one-year-old child

పసివాడి ఏడుపు విన్న చుట్టుపక్కల వారు… సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన తండ్రికి విషయం చెప్పారు. కొద్ది రోజుల పాటు నిఘా పెట్టి తల్లి క్రూరత్వాన్ని తెలుసుకున్నాడు తండ్రి. ఒకట్రెండుసార్లు చెప్పి చూసినా ఫలితం లేదు. చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినా.. వాళ్లు పట్టించుకోలేదు. ఇక చేసేది లేక… భార్య  అరాచకాలను సాక్ష్యాలతో సహా నిరూపించాలని నిర్ణయించుకున్నాడు. ఆమెకు తెలియకుండా ఇట్లో సీసీ కెమెరాలు పెట్టాడు. సీసీ టీవీల్లో తన భార్య క్రూరమైన ప్రవర్తన చూసి షాకయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

- Advertisement -