కెప్టెన్ కోహ్లీ.. మహా పిసినారి!

670
- Advertisement -

టీం ఇండియా క్రికెట్ లో వరుసపెట్టి సెంచరీలు చేసి – బయట ప్రపంచంలో అనుష్క శర్మతో ప్రేమాయణం సాగించి ఫుల్ గా వార్తల్లో నిలిచాడు విరాట్ కొహ్లీ. మైదానంలో సెంచరీలు చేసి బ్యాట్ ఎత్తడంలోనూ – స్టాండ్స్ లో కూర్చున్న గర్ల్ ఫ్రెండ్ కి ఫ్లైయ్యింగ్ కిస్ లు ఇవ్వడంలోనూ మనోడు బహు నేర్పరి. ఇవి ఇప్పటివరకూ బయట ప్రపంచానికి తెలిసిన విషయాలు. అయితే ఇవే కాదు విరాట్ కొహ్లీలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.. వాటిలో పిసినారితనం కూడా ఒకటి అని వరుసపెట్టి చెప్పాడు యువరాజ్ సింగ్.

Virat Kohli a miser and the angry young man of Indian team, reveals Yuvraj Singh

మనకు తెలిసిన విరాట్ కోహ్లి.. ఓ రన్ మెషీన్. అంతకుమించి.. టార్గెట్ ను చేధించడంలో మొనగాడు. క్రీజులో అడుగుపెట్టాడంటే.. ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా అలుపు సొలుపు లేకుండా చేధించి పారేయగలడు. అయితే టీమ్ ఇండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ విరాట్ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం చెప్పాడు. అదేంటంటే.. ‘కోహ్లి చాలా పిసినారి’. విరాట్ కోహ్లి ఇత‌ర క్రికెట‌ర్ల గురించి కొన్ని స‌ర‌దా సంగ‌తుల‌ను బ‌య‌ట‌పెట్టాడు యువీ. అన్ని కోట్లు సంపాదిస్తున్న ఖ‌ర్చు విష‌యానికి వ‌స్తే ఈ యంగ్ హీరో లెక్క‌లు తూచా త‌ప్ప‌క పాటిస్తాడ‌ని యువీ చెప్పాడు. దానికి నువ్వు ఖ‌ర్చు పెట్టు…మ‌రొక దానికి నేను ఖ‌ర్చు పెడాత‌నంటూ లెక్క‌లు వేస్తాడ‌ట కోహ్లీ.

Virat Kohli a miser and the angry young man of Indian team, reveals Yuvraj Singh

పెద్ద పార్టీ ఇస్తున్నానంటూ త‌ప్ప‌కుండా రావాల‌ని మాజీ ఫాస్ట్ బౌల‌ర్ జ‌వ‌గ‌ళ్ శ్రీనాథ్ కేవ‌లం అన్నం ప‌ప్పుచారుతో స‌రిపెట్టిన‌ట్లు యువీ చెప్పాడు. మ‌రోవైపు సుదీర్ఘంగా క్రికెట్ ఆడిన స‌చిన్‌ను త‌ను స‌రదాగా తాతా అని పిలిచినందుకు ఇప్ప‌టికీ త‌ను ఆట‌ప‌ట్టిస్తూ ప్ర‌తీకారం తీర్చుకుంటాడ‌ని ఈ డ్యాషింగ్ బ్యాట్స్‌ మెన్ వెల్ల‌డించాడు.
పిసినారి గ్రూప్‌లో మ‌రో సీనియ‌ర్ క్రికెట‌ర్ ఆశిష్ నెహ్రా కూడా ఉన్న‌ట్లు చెప్పాడు. ఎక్క‌డికైనా వెళితే త‌ను ఎక్కువ‌గా ఖ‌ర్చు చేయాలేన‌ని చెప్పేవాడ‌ట‌. త‌న‌కు భార్యా పిల్ల‌లు ఉన్నారని అందుకే మితిమీరిన ఖ‌ర్చు చేయ‌లేన‌ని స‌ర‌దాగా చెప్పేవాడ‌ని యువ‌రాజ్ వివ‌రించాడు.

Virat Kohli a miser and the angry young man of Indian team, reveals Yuvraj Singh

నీకు న‌చ్చిన బెస్ట్ కెప్టెన్ ఎవ‌రని అడ‌గ్గా… త‌న‌కెప్ప‌టికీ సౌర‌వ్ గంగూలీనే బెస్ట్ కెప్టెన్ అని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే యువీ కెరీర్ గంగూలీ నేతృత్వంలోనే స్టార్ట్ అయింద‌ని వివ‌రించాడు. అంతేకాదు అప్ప‌ట్లో సెహ్వాగ్, జ‌హీర్‌ఖాన్, ఆశిష్ నెహ్రా, హ‌ర్భ‌జ‌న్ లాంటి వారంద‌రినీ ఒక జ‌ట్టుగా చూసి మ‌ద్‌మతు తెలప‌డంతోనే ఈ రోజు అంద‌రూ ఈ స్థాయికి చేరుకున్న‌ట్లు యువీ గుర్తుకు చేసుకున్నాడు. ఇంత‌కీ ఈ విష‌యాల‌న్ని ఎక్క‌డ చెప్పార‌నుకుంటున్నారా… ఓ ఎఫ్ ఎం రేడియోకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో యువీ జ‌ట్టులోని కొంద‌రి ర‌హ‌స్యాల‌ను బ‌య‌ట‌పెట్టాడు.

- Advertisement -