ప్రజా ఆమోదం పొందేలా ఆధునిక పోలీసు వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.ముఖ్యంగా నేరాలను నిరోధించడం, శాంతిభద్రతల్ని పరిరక్షించడం, స్వచ్ఛందంగా చట్టాన్ని పాటించేలా ప్రజల్ని చైతన్యపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. తొలిసారిగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఈ విధానాన్ని ప్రారంభించారు. దశల వారిగా అన్ని జిల్లాలకు విస్తరింపజేశారు. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’లో భాగంగా మన జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం మంచి ఫలితాలనే ఇచ్చింది. ప్రజల మన్ననలు పొందింది. అయితే, కొన్నిచోట్ల కొంతమంది అధికారుల దురుసు ప్రవర్తనతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికే మచ్చతెచ్చేలా మారింది. ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఓ వ్యక్తిపై మంచిర్యాల పోలీసులు చేయి చేసుకోవడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా స్పందించిన కేటీఆర్….ఇదేం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ డీజీపీ అనురాగ్ శర్మకు ట్విట్ చేశారు.
https://youtu.be/Z3hS9hBCoHI