తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్న పొంగులేటి బీజేపీ కండువా కప్పుకొనున్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన పొంగులేటి రాహుల్ గాంధీకి రాజీనామా లేఖ పంపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి తెలంగాణ కాంగ్రెస్లో కీలకంగా పనిచేశారు. ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి, అసెంబ్లీ సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క తప్ప మిగితా వారంతా పార్టీని వీడి వేరే పార్టీల్లో చేరిపోయారు.
ఈసందర్భంగా తాజాగా పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు పొంగులేటి. తప్పని సరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులకు డబ్బే ముఖ్యమైందరన్నారు. దేశంపై ఉగ్రవాడుదుల చేసిన దాడులపై కాంగ్రెస్ నేతలు మాట్లాడిన తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.