అంజన్ కళ్యాణ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అంజన్ కె. కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘అత్తారిల్లు’. అంతా కొత్త నటీనటుతో రూపొందిన ఈ హర్రర్ కామెడీ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లోని ఫిలించాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో చిత్ర దర్శక నిర్మాత అంజన్ కె. కళ్యాణ్ మాట్లాడుతూ…“ న్యూ టాలెంట్ ని చిత్ర పరిశ్రమకు పరిచేయాలని కొత్తవాళ్లందరం కలిసి చేసిన ప్రయత్నం `అత్తారిల్లు`. ఈ శుక్రవారం విడుదల చేశాము. విడుదలైన అన్ని చోట్ల నుంచి రెస్పాన్స్ బాగుంది. చూసిన చాలా మంది వారికి నచ్చిన సీన్స్ గురించి నాతో డిష్కస్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నా. ఇక నిన్నటి నుంచి నాకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఒక పాత్రను పెట్టారు. వెంటనే వాటిని తొలిగించండని. కానీ వాళ్లందరికీ మీడియా ద్వారా నేను చెప్పదలచుకున్నది ఏంటంటే…ఎక్కడా బ్రాహ్మణులను కించపరిచే విధమైన సంభాషణలు కానీ ..సీన్స్ కానీ చేయలేదు. మీరు పాజిటివ్ వేలో చూస్తే బ్రాహ్మణుల గురించి మంచిగా చెప్పే ప్రయత్నం చేశాం. కాబట్టి నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా చూడాలని కోరకుంటున్నా. నిజంగా వారిని కించ పరిచే విధమైన సన్నివేశాలు, సంభాషణలు ఉంటే సెన్సార్ వారు అభ్యతరం చెప్పే వాళ్లు కదా. మరి కొంత మంది ఎందుకిలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఏది ఏమైనా మేము అనుకున్నదానికన్నా మా సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.