అక్టోబ‌ర్ లో శ్రీశాంత్ టీమ్ 5..

204
srishanth team 5
- Advertisement -

ఇండియన్ మాజీ సూపర్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ హీరోగా మెట్ట‌మెద‌టి సారిగా నటిస్తున్న చిత్రం టీమ్ 5. శ్రీశాంత్ చాలా మంచి డ్యాన్సర్ అనే విషయం తెలిసిందే. రాజ్ జకారిస్ ప్రొడక్షన్ వాల్యూస్, ద‌ర్శ‌కుడు సురేష్ గోవింద్ చెప్పిన కథ, కథనం బాగా నచ్చడంతో హీరోగా శ్రీశాంత్ నటిస్తున్నారు. పదునైన బౌలింగ్ తో బ్యాట్స్ మెన్ ను హడలెత్తించిన శ్రీశాంత్ ఇప్ప‌డు వెండితెర‌పై బైక్ రైస‌ర్ గా క‌నిపిస్తున్నాడు. అంతేకాకుండా శ్రీశాంత్ చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నారు. తన క్యారెక్టర్ తో పాటు, డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్, గెటప్, కాస్ట్యూమ్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక కన్నడ స్టార్ హీరోయిన్ నిక్కీ గర్లానీ హీరోయిన్ గా చేస్తుంది.పెర్ల్ మానే, మఖరంద్ దేశ్ పాండే ఇతర పాత్రలు పోషించారు. గోపి సుందర్ అందించిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. అక్టోబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు.

srishanth
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ జకారియాస్ మాట్లాడుతూ… ఇండియన్ మాజీ స్టార్ క్రికెటర్ శ్రీశాంత్ ని సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని ఆయన అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఆ అరుదైన అవ‌కాశాన్ని శ్రీశాంత్ గారు మాకు ఇచ్చినందుకు వారికి మా ధ‌న్య‌వాదాలు. మా కథ, కథనం మీద నమ్మకంతో… ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఉండే క్యారెక్టర్ కావడంతో ఒప్పుకున్నారు. చిత్రంలో బైక్ రైస‌ర్ గా న‌టిస్తున్నారు. 5గురు ఫ్రేండ్స్ బైక్ రైస‌ర్స్ గా వారి జీవితంలో ఎలాంటి మార్పులు వ‌చ్చాయనేది ముఖ్య క‌థాంశంగా తెర‌కెక్కించాము. మా చిత్రంలో అన్ని ఎమెష‌న్స్ వుంటాయి. మంచి ఫ్రెండ్‌షిప్, ల‌వ్‌స్టోరి, ఫ్యామిలి ఎమెష‌న్స్ వుంటాయి. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అక్టోబ‌ర్ లో చిత్రం విడుద‌ల‌కి స‌న్నాహ‌లు చేస్తున్నాము. స్టార్ హీరోయిన్ నిక్కీ గర్లానీ, శ్రీశాంత్ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. టీమ్ 5 అనే టైటిల్ కు తగ్గట్టుగా మా దర్శకుడు సురేష్ గోవింద్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్న అతిత్వరలోనే ఆడియో విడుద‌ల చేస్తాము. ఇటీవ‌లే టీజ‌ర్ ని విడుద‌ల చేశాము. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి మంచి అప్లాజ్ వ‌చ్చింది. చిత్రం కూడా చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంద‌ని మా న‌మ్మ‌కం. అని అన్నారు.
నటీనటులు, శ్రీశాంక్. నిక్కీ గర్లానీ, పార్లే మానే, మకరంద్ దేశ్ పాండే తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ – సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్

సంగీతం – గోపి సుందర్

ఎడిటర్ – దిలిప్ డెన్నిస్

ఆర్ట్ – సాహస్ బాల

డైరెక్టర్ – సురేష్ గోవింద్

ప్రొడ్యూసర్ – రాజ్ జకారియాస్

- Advertisement -