జాకబ్‌ జుమాకు 15నెలల జైలు శిక్ష

225
zuma
- Advertisement -

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమా(79)కు గట్టి షాక్ తగిలింది. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం 15నెలల జైలు శిక్షను విధించింది. తాజాగా కోర్టు ధిక్కార శిక్ష విధింపు సమయంలో సైతం జూమా కోర్టులో లేరు. ఏదైనా పోలీసు స్టేషన్‌లో లొంగిపోయేందుకు ఆయనకు కోర్టు ఐదురోజుల సమయం ఇచ్చింది. ఈ సమయంలో లొంగుబాటుకు రాకుంటే అరెస్టుకు ఆదేశాలిస్తారు.

జుమా పదవీ కాలంలో జరిగిన అవినీతిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి జరుగుతన్న విచారణకు హాజరవ్వాలని ఆదేశించినా పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కారం కింద ఈ శిక్షను విధించింది. 2009–18 కాలంలో జుమా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు.

- Advertisement -