సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ ఫేస్ బుక్‌కు భారీ షాక్ తగిలింది. ఫేస్ బుక్ నుండి కొన్ని కంపెనీలు యాడ్స్ విరమించుకోవడంతో భారీ నష్టాలను చవిచూసింది ఫేస్ బుక్. ఆ కంపెనీ షేర్లు 8.3 శాతం నష్టపోగా ఫేస్ బుక్ చీఫ్ జుకర్ బర్గ్ 7.2 బిలియన్ డాలర్లు(దాదాపు 50 వేల కోట్లు) నష్టపోయారు.
ఫేస్‌బుక్ షేర్ల ధరలు తగ్గడంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ 56 బిలియన్ డాలర్లకు పడిపోగా జుకర్‌బర్గ్ సంపద 82.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో జుకర్ మూడో స్ధానం నుండి నాలుగో స్ధానంకు పడిపోయారు.
ఫేస్‌బుక్‌లో తప్పుడు సమాచారం వస్తోందని విమర్శలు రావడంపై జుకర్‌బర్గ్ స్పందించారు. వర్ణ వివక్ష, విద్వేష వ్యాఖ్యలు నిలువరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.యూనిలివర్ సంస్థతో పాటు వెరిజాన్ కమ్యూనికేషన్స్, హెర్షె కో కంపెనీ ఫేస్ బుక్‌లో యాడ్స్ తగ్గిస్తామని ప్రకటించగా కోకాకోలా సైతం సోషల్ నెట్‌వర్కుల్లో ప్రకటనలు ఇవ్వడం మానేసింది.