నేటి నుండి ఎంపీటీసీ,జడ్పీటీసీ నామినేషన్లు

7
- Advertisement -

నేడు మొదటి విడత ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. ఉదయం 10:30 కు నోటిఫికేషన్ విడుదల చేయనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరణ కార్యక్రమం ఉండనుంది.

ఈనెల 11వరకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీకాగా ఈ నెల 12న నామినేషన్ల పరిశీలన,12 ని చెల్లుబాటు అయిన నామినేటెడ్ అభ్యర్థుల జాబితా,13న అప్పీల్ కు చివరి తేదీ ,14న అప్పీల్ పరిష్కరణకు చివరి తేదీ కానుంది.

15న నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ కాగా 15న పోటీ చేయు అభ్యర్థుల జాబితా ప్రచురించనున్నారు. ఈనెల 23న ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ జరగనుండగా నవంబర్ 11న ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Also Read:జూబ్లీహిల్స్ .. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్

- Advertisement -