ఏప్రిల్ 22 నుండి స్థానిక ఎన్నికలు..

270
ZPTC, MPTC elections
- Advertisement -

తెలంగాణలో త్వరలోనే జిల్లా, మండల ప్రజా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 22వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది. 32 జిల్లాలకు చెందిన 535 జడ్పీటీసీ, 5857 ఎంపీటీసీ స్థానాలకు చెందిన రిజర్వేషన్లు ఇప్పటికే ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన తేలనున్నాయి. లోక్‌సభ ఫలితాల తరువాతనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదివరకే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. దీనికి ఈసీఐ సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి గతంలోనే లేఖ రాసింది. శుక్రవారం దీనిపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలంటూ తేదీలను ఈసీకి ప్రతిపాదించింది.

- Advertisement -