ముగిసిన తొలి విడత పరిషత్ ఎన్నికల ప్రచారం

176
tssec

తెలంగాణలో స్ధానిక సంస్ధల ఎన్నికలు మూడు విడతలుగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈనెల 6వ తేదిన మొదటి విడత, 10న రెండవ విడత, 14న మూడవ విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి నామినేషన్లు పూర్తయ్యాయి. అయితే మే 6 న మొదటి విడత ఎన్నికలు ఉండటంతో ఇవాళ సాయంత్రం 5గంటల వరకూ ప్రచారం ముగిసింది.

దీంతో టీవీలు, రేడియోల్లోనూ ప్రచారం నిషేదమని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. తొలి విడత పోలీంగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని..పోలింగ్ బూత్ ల వద్ద పటిష్ట బందొబస్తు ఏర్పాటు చేశామన్నారు ఎన్నికల అధికారులు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానికేతరులు ఉండరాదని.. ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు ఆయా ప్రాంతాలను వదిలి వెళ్లిపోవాలని సూచించింది.

తొలివిడతలో మొత్తం 2,097 ఎంపీటీసీ, 195 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడత పోలింగ్ ఈనెల 6వ తేదిన ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ జరుగనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ జరుగనుంది.