‘జాంబీ రెడ్డి’ ట్రైలర్.. ఈ సంక్రాంతికి జాంబీలు వస్తున్నాయి..

44
Zombie Reddy

డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ రూపొందిస్తోన్న ‘జాంబీ రెడ్డి’ చిత్రంతో తేజ స‌జ్జా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆనంది, ద‌క్ష హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇదివ‌ర‌కు హీరోయిన్‌ సమంత రిలీజ్ చేసిన ‘జాంబీ రెడ్డి’ ఫ‌స్ట్ బైట్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్ ల‌భించింది. ఈ నేపథ్యంలో యంగ్ రెబ‌ట్ స్టార్ ప్ర‌భాస్ చేతుల మీదుగా తాజాగా ‘జాంబి రెడ్డి’ సినిమా ట్రైలర్‌ను విడుద‌ల చేశారు. క‌రోనా గురించి ప్ర‌ధాని మోదీ చెప్పిన జాగ్ర‌త్త‌ల వీడియోతో ఈ ట్రైల‌ర్ ప్రారంభం అవుతోంది.

రాయలసీమ నేపథ్యంలో కథ సాగుతుంది. క‌రోనా డైలాగుల‌తో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ట్రైల‌ర్ కొనసాగుతోంది. తెలుగులో జాంబి జానర్ సినిమా రావ‌డం ఇదే తొలిసారి. ఈ సంక్రాంతికి అల్లుళ్లు కాకుండా జాంబీలు వస్తున్నారంటూ డైలాగులు ఉన్నాయి. పూర్తి వినోదాత్మ‌కంగా ఈ సినిమా సీన్లు ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. యాపిల్‌ ట్రీ స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌ శేఖర్‌ వర్మ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న ఈ మూవీని త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

#ZombieReddyOfficialTrailer | A Prasanth Varma Film | Teja Sajja | Raj Shekar Varma | Mark K Robin