డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందిస్తోన్న ‘జాంబీ రెడ్డి’ చిత్రంతో తేజ సజ్జా హీరోగా పరిచయమవుతున్నారు. ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదివరకు హీరోయిన్ సమంత రిలీజ్ చేసిన ‘జాంబీ రెడ్డి’ ఫస్ట్ బైట్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. ఈ నేపథ్యంలో యంగ్ రెబట్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా తాజాగా ‘జాంబి రెడ్డి’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కరోనా గురించి ప్రధాని మోదీ చెప్పిన జాగ్రత్తల వీడియోతో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతోంది.
రాయలసీమ నేపథ్యంలో కథ సాగుతుంది. కరోనా డైలాగులతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ట్రైలర్ కొనసాగుతోంది. తెలుగులో జాంబి జానర్ సినిమా రావడం ఇదే తొలిసారి. ఈ సంక్రాంతికి అల్లుళ్లు కాకుండా జాంబీలు వస్తున్నారంటూ డైలాగులు ఉన్నాయి. పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా సీన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజ్ శేఖర్ వర్మ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ మూవీని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.