తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటిస్తుండగా సినిమా ప్రమోషన్‌లో ప్రభాస్,వరుణ్ తేజ్ హైప్ క్రియేట్ చేయగా ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది.
కథ:
లాన్ డౌన్ ప్రకటించిన నేపథ్యంతో సినిమా మొదలుకాగా అది పట్టించుకోని హీరో తేజ సజ్జ తన గ్యాంగ్.. దక్ష నగార్కర్, కిరీటితో కలిసి రాయలసీమలో స్నేహితుడు ఆర్జే హేమంత్ పెళ్లికి వెళ్తారు. ఈ ప్రయాణంలో వారికి అనుకోని సంఘటన ఎదురై గ్యాంగ్‌లోని కిరీటి జాంబీగా మారిపోతాడు. తర్వాత ఆ ఊర్లోని వాళ్లంతా జాంబీలుగా మారుతుంటారు. అసలు వారు జాంబీలుగా ఎలా మారారు..?మిగిలిన వారు వారిని తిరిగి సాధారణ మనుషులుగా ఎలా చేయగలిగారు…?కథా ఎలా సుఖాంతం అయిందనేది జాంబీరెడ్డి కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కథ,హారర్ కామెడీ,నటీనటులు,సెకండాఫ్. తొలి సినిమాతోనే మెప్పించారు ధృవ్ సర్జా. అతడి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా నటించి పాత్రలకు తమ వంతు న్యాయం చేశారు. జాంబీల మేకప్, నడిచే తీరు, దాడి చేసే విధానం అన్నీబాగున్నాయి, ముఖ్యంగా జాంబీలతో పోరాడే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకే హెలైట్.
మైనస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ క్లైమాక్స్ లాజిక్ అందరికీ నచ్చకపోవచ్చు. మొదటి పార్ట్‌ను కాస్త గాలికొదిలేయకుండా ఏవైనా రెండు, మూడు కీలక సన్నివేశాలను రాసుకొని ఉండుంటే బాగుండేది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరో లెవల్‌లో ఉంది. పాటలు బాగున్నాయి. విజువల్స్, మేకింగ్ అన్నీ సరిగ్గా సరిపోయాయి. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
హారర్ సినిమాకు కమర్షియల్ టచ్ ఇస్తూ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చేసి ప్రేక్షకులను సీటుకు కట్టిపడేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.తెలుగులో ఇంతవరకు ఏ దర్శకనిర్మాత టచ్ చేయని జానర్ జాంబీ. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో పర్వాలేదనిపించే మూవీ జాంబీ.
విడుదల తేదీ: 05/02/2021
రేటింగ్: 2.5/5
నటీనటులు : తేజ సజ్జ, ఆనంది
సంగీతం : మార్క్ కె. రాబిన్
నిర్మాత : రాజశేఖర్ వర్మ
దర్శకుడు : ప్రశాంత్ వర్మ