పూణెలో జికా వైరస్ కలవరం..

10
- Advertisement -

దేశంలో మళ్లీ జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్రలోని పూణెలో 6 జికా వైరస్ కేసులు నమోదవ్వగా.. వారిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఎరంద్ వానే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల గర్భిణీ స్త్రీ కి జికా వైరస్ సోకినట్లు గుర్తించామని వెల్లడించారు.

వాస్తవానికి గర్భిణి స్త్రీలు జికా వైరస్ బారిన పడితే పిండంలో మెక్రోసెఫాలీ సంభవించి.. మెదడు అభివృద్ధి చెందకపోవచ్చు.జికా వైరస్ సోకిన వ్యక్తులకు కణాలలో వాక్యూల్స్, మైటోకాండ్రియా ఉబ్బడం, జ్వరం లక్షణాలు ఉంటాయి. ఈ వాపు చాలా తీవ్రంగా ఉంటుంది.

చర్మంపై దద్దుర్లు ఏర్పడటం, తలనొప్పి, కండరాలు, కీళ్లనొప్పులు, కనురెప్పల కిందిభాగంలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీకూ ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.

Also Read:Trump:ట్రంప్‌కు రిలీఫ్

- Advertisement -