జికా ఎఫెక్ట్..కేంద్రం కీలక ఆదేశాలు

8
- Advertisement -

జికా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకే కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.ముఖ్యంగా గర్భిని స్త్రీలకు వైరస్‌ పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. పూణెలో ఇప్పటివరకు ఆరు కేసులు నమోదుకాగా ఇందులో ఇద్దరు గర్భవతులు ఉన్నారు.

ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది కేంద్రం. ఇంటి ఆవరణలో ఏడిస్ దోమలు లేకుండా చూసేందుకు నోడల్ అధికారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించింది. నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, సంస్థలు, ఆరోగ్య సౌకర్యాల్లో కీటకాలు లేకుండా నిఘా పెంచాలని ఆదేశించింది.

ఆడ ఎడిస్‌ దోమ కుట్టడం వల్ల జికా వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని ఓ కోతిలో గుర్తించారు. ఈ వైరస్‌ సోకినవారిలో జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Also Read:విశ్వక్ సేన్..’లైలా’ గ్రాండ్ లాంఛ్

- Advertisement -