యుఎస్ టాప్ టెన్ కలెక్షన్స్ లో “అల వైకుంఠపురంలో”

656
Ala Vaikuntapuramlo
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అల..వైకుంఠపురంలో. పూజా హెగ్డె కథానాయికగా నటించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈమూవీకి అద్భుతమైన స్పందన వస్తోంది. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ప్రీమియర్ కలెక్షన్లను అల వైకుంఠపురంలో క్రాస్ చేసింది. ఫుల్ పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది.

అమెరికాలో ‘అల వైకుంఠపురంలో’ ఓ రేంజ్‌లో దూసుకుపోతోందనే చెప్పాలి. అమెరికాలోనే కాదు న్యూజిల్యాండ్‌లో ‘అల వైకుంఠపురంలో’ రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ 176 ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 793k డాలర్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదు. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా చెప్పుకోవచ్చు..

- Advertisement -