‘దంగల్’ సినిమాలో నటించి తన నటనతో అనేక మంది ప్రేక్షకులను సంపాదించుకుంది బాలీవుడ్ నటి జైరా వాసిం. ఈ చిత్రంలో ఆమిర్‌ఖాన్‌కు కూతురిగా నటించి ప్రముఖుల నుంచి ప్రశంసలందుకుంది. ఈ సినిమాతో ఆమెకు జాతీయ అవార్డు దక్కింది. చిన్న వయస్సులోనే అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి తన టాలెంట్ ఎంటో నిరూపించుకుంది. ఆ తర్వాత ఆమిర్‌ఖాన్ నటించిన ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ చిత్రంలోనూ మెరిసింది.
తాజాగా ఈ నటి తాను ఎదుర్కోంటున్న సమస్యలను సోషల్ మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్టు పెడుతూ…నేను మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని సిగ్గుపడకుండా, భయపడకుండా నేను ఎదుర్కొంటున్న సమస్యను మీతో పంచుకోవాలనుకున్నానని తన ఆవేదన వ్యక్తం చేసింది. రోజు ఐదు యాంటీ డిప్రెసెంట్ మందులు వేసుకుంటున్నానని, అప్పుడప్పుడు విపరీతమైన నిద్రపోతు మితిమీరిన ఆహారం తింటున్నానని వెల్లడించింది జైరా.
ఇలాంటి పరిస్థితులను భరించలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని తన ఆవేదనను వ్యక్త పరిచింది. డాక్టర్ వద్దకు తీసుకెళ్లినప్పుడు ‘నీకు 17 ఏళ్లే. ఈ వయసులో డిప్రెషన్ ఏంటి?’ అని అంటున్నారు. నాకు అన్నింటి నుంచి కొంత విరామం కావాలి. నేను రంజాన్ మాసం కోసం ఎదురుచూస్తున్నా. ఆ పవిత్ర సమయంలో నా సమస్యలు నా నుండి దూరమౌవుతాయని అనుకుంటున్నానని, మీ ప్రార్థనల్లో నన్నూ గుర్తుచేసుకోండి’ అని పేర్కొంది జైరా.