నవ్వకండి.. ఇక నుంచి భాగస్వాములం !

235
Zaheer Khan, Sagarika Ghatge Officially Engaged
Zaheer Khan, Sagarika Ghatge Officially Engaged
- Advertisement -

‘చక్ దే ఇండియా’లో నటించిన సాగరిక ఘట్కే, ప్రముఖ క్రికెటర్ జహీర్ ఖాన్ మధ్య ఎఫైర్ ఉందని, ఇద్దరూ కలిసి కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారని చాలా కాలంగా రూమర్స్ వినిపించాయి. సీక్రెట్ గా తమ ప్రేమ వ్యవహారం కొనసాగించిన గత నెలలో ఐపీఎల్ జరుగుతుండగా ఓపెన్ అయిపోయారు. ఐపీఎల్ మ్యాచ్ ల గ్యాపులో సాగరికను గోవా తీసుకెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ జహీర్ ప్రపోజ్ చేసాడు. ఆమె అందుకు ఓకే చెప్పడంతో ఈ విషయాన్ని నెల రోజుల క్రితమే అభిమానులకు ట్విట్టర్ ద్వారా అపీషియల్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే.‘మీ భార్య ఎంపికలపై నవ్వకండి. ఎందుకంటే అందులో మీరు కూడా ఉన్నారు. ఇక నుంచి జీవితాంతం భాగస్వాములం’ అని జహీర్‌ గత నెలలో ట్వీట్‌ చేశాడు.

Zaheer Khan, Sagarika Ghatge Officially Engaged

తాజాగా క్రికెటర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ నటి సాగరిక ఘాట్గేల నిశ్చితార్ధ వేడుక మంగళవారం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్‌లో విరాట్, అనుష్కల జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇరువురు చేతిలో చేయి వేసుకుని వేడుక వద్దకు చేరుకున్నారు. విరాట్ అనుష్క జోడీతో పాటు సచిన్ దంపతులు, రోహిత్ శర్మ దంపతులు, యువీ, మహ్మద్ కైఫ్.. పలువురు మాజీ క్రికెటర్లు ఈ ఫంక్షన్‌కు హజరయ్యారు.

Zaheer Khan, Sagarika Ghatge Officially Engaged Zaheer Khan, Sagarika Ghatge Officially Engaged 24zaheer-engagement4 24zaheer-engagement5 24zaheer-engagement6 24zaheer-engagement8 24zaheer-engagement9 24zaheer-engagement10 24zaheer-engagement11

- Advertisement -