ఢిల్లీ సీఎంకు Z కేటగిరీ సెక్యూరిటీ

9
- Advertisement -

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు Z కేటగిరీ సెక్యూరిటీని కేటాయించింది కేంద్రం. సీఎం అధికారిక నివాసం వద్ద CRPF బలగాలు బందోబస్తు నిర్వహించనున్నాయి. నిన్న ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఓ దుండగుడు దాడి చేయడంతో Z కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది కేంద్రం.

మరోవైపు దాడి ఘటనపై ‘ఎక్స్’ వేదికగా స్పందించారు రేఖా గుప్తా. ఉహించని ఈ ఘటనతో షాక్‌ తిన్నానని..ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు. ఇలాంటి దాడులు తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవని.. ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత ఎనర్జీతో ముందుకువస్తానని వెల్లడించారు.

- Advertisement -