ఏపీ సీఎం జగన్ నిర్ణయాలతో టీటీడీ తిరుపతిని మెడికల్ హబ్‌గా మారబోతుందన్నారు టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి . స్విమ్స్‌లో రూ.1.95 కోట్లతో నిర్మించిన రోగుల సహాయకుల వసతి భవనాన్ని ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. టీటీడీ ఆధ్వర్యంలో స్విమ్స్, బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం పేదలకు విశేష వైద్యసేవలు అందిస్తున్నాయని చెప్పారు.
టాటా క్యాన్సర్ ఆసుపత్రి, అరవింద కంటి ఆసుపత్రిని కూడా తిరుపతికి తీసుకురావడానికి టీటీడీ తన వంతు సహకారం అందించిందన్నారు. రాబోయే రోజుల్లో స్విమ్స్‌లో శ్రీ బాలాజి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. తిరుపతి నగరం నడిబొడ్డున పేదలకు అనేక వ్యాధులకు సంబంధించి కార్పొరేట్ ఆసుపత్రుల కంటే మిన్నగా ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. రోజుకు నాలుగైదు వందలు పెట్టి లాడ్జీలో రూములు తీసుకోలేని పేదలకు ఈ వసతి భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
Also Read:Sushanth:మెగాస్టార్‌తో నటించడం నా అదృష్టం
ఇక ఇవాళ డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో తెలుసుకున్నారు.