టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ వివాహా ముహుర్తానికి సమయం దగ్గరపడుతోంది. దీంతో యూవీ పెళ్లికి హాజరు కావాలంటూ అతిథులను ఆహ్వానించే పనిలో ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రధాని మోడీని ఆహ్వానించాడు. తల్లి షబ్నం సింగ్తో కలిసి పార్లమెంట్కు వెళ్లి..మోడీకి పెళ్లి పత్రికను అందించాడు. పెళ్లికి రావాల్సిందిగా మోడీని కోరారు.
మోదీని కలిసిన అనంతరం పలువురు కేంద్ర మంత్రులని కూడా తన వివాహానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రాజకీయ ప్రముఖలతో పాటు సినీ తారలకు..క్రికెటర్‌లకు ఆహ్వానించాడు. హాలీవుడ్ నటి హజల్కీచ్లతో గత ఏడాది నుంచి ప్రేమయాణం నడుపుతున్న యూవీ..పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆమెతో నిశ్చితార్థం చేసుకున్న యూవీ పెళ్లి ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు..
యూవీ వివాహవేడుకకు ఓ ప్రత్యేకత ఉంది. హజల్ కీచ్ది హిందూ సాంప్రదాయం కావడంతో వీరిపెళ్లి గుర్ ద్వారా సాంప్రదాయంతో పాటు హిందూ సాంప్రదాయంలోనూ జరగనుంది. వీరిద్దరికీ ఈ నెల 30వ తేదీన చండీగఢ్ లో గురుద్వారా సాంప్రదాయంలో వివాహం జరగనుంది. తరువాత వచ్చేనెల 2న గోవాలో హిందూ సాంప్రదాయంలో మరో వివాహ వేడుకను నిర్వహించనున్నారు. ఇక పెళ్లి విందు, ఇతర వేడుకలు వచ్చేనెల 5న ఢిల్లీలో, తరువాత 7న చతర్పూర్లోని ఫామ్ హౌస్లో జరగనున్నాయి. మొత్తానికి యూవీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.