రూ. 2000నోటు కూడా రద్దు….!

128
Indian Rs. 2,000 notes ban

అవినీతిపై పోరాడేందుకు భారతప్రభుత్వం రూ.500,1000నోట్లను రద్దు చేసింది. నవంబర్‌ 8వ తేదిన జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ ఈ నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. మోడీ ప్రకటనలో రూ.500,1000నోట్లను చెల్లనివిగా ప్రకటించి కొత్త రూ.500,2000లను చెలామణిలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా మారిన దొంగనోట్ల మాఫియాను… దేశంలోని నల్లధనాన్ని దెబ్బతీసేందుకు ఈ చర్య చేపట్టినట్లు నరేంద్ర మోడీ వెల్లడించారు.

Indian Rs. 2,000 notes ban

అయితే నరేంద్రమోడీ ప్రకటించిన నోట్ల రద్దు విధానం చాలా బాగుందని తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు బీహార్‌ సీఎం నితిష్‌కుమార్‌ కూడా సమర్ధించారు. దీని వల్ల అవినీతి అంతమైపోతుందని. దేశంలోనూ, రాష్ట్రంలోనూ అవినీతి పెరగడానికి 500, 1000 రూపాయల నోట్లు కూడా ఓ ప్రధాన కారణమని,.. పెద్ద నోట్ల కారణంగానే నకిలీ నోట్ల కూడా చలామణి ఎక్కువగా సాగుతోందని వారు అభిప్రాయపడ్డారు.

Indian Rs. 2,000 notes ban

నోట్ల రద్దుతో ప్రజలు రోజురోజుకు చాలా ఇబ్బందులు పడుతున్నవిషయం తెలిసిందే. నల్లకుబేరులకు నోట్ల రద్దు ప్రభావం ఎలాఉందో తెలియదు కాని సామాన్య ప్రజలకు మాత్రం ముందు గొయ్యి వెనక నుయ్యి అన్న విధంగా తయరైంది. గంటల తరబడిలైన్లో నిలుచోని పాతనోట్లను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దినసరికూలీలు, చిరు వ్యాపారులు, మధ్యతరగతి ఉద్యోగులే బ్యాంక్‌ క్యూ లైన్లో ఎక్కవగా కనిపిస్తున్నారు. కొంతమంది మోడీని పొగుడుతున్నారు మరికొంత మంది నోట్ల రద్దు చేసే ముందు మోడీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యారని సామాన్యులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Indian Rs. 2,000 notes ban

ఈ సంగతి ఇలా ఉంటే వచ్చే ఏడాది జూన్‌లో రూ.2000 నోటు కూడా రద్దు అవుతుందట..! కేవలం 500.. ఆలోపు నోట్లు మాత్రమే అమల్లో ఉంటాయాట… రూ.2000వేల నోట్లను కొద్దికాలంలోనే రద్దు చేయడం తప్పనిసరి అంటూ ఆర్థికనిపుణులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రూ.2000లనోటు చెలమాణిలో ఉంటే రాబోయే రోజులో ఈనోటుతో అవినితి ఎక్కువగా పాల్పడే అవకాశం ఉందని కేంద్రం భావిస్తుందట. రూ.2000 నోటును రద్దు చేసిన తర్వాతే రూ. 500 నోట్లు భారీగా మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చెల కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న వెంటనే 500 నోట్ల కంటే ముందు రూ. 2000 నోట్లు పెద్ద ఎత్తున మార్కెట్లోకి రావడానికి ఇది ఒక ప్రధాన కారణం అని మనం చెప్పుకొవచ్చు. ప్రస్తుతం 4 నోట్ల ప్రింటింగ్‌ ప్రెస్‌లు ఉంటే.. ఒక్క దానిలోనే 2000 నోట్ల ప్రింటింగ్‌ జరుగుతోందట. అంటే రాబోయే రోజుల్లో రూ.2000నోట్లు రద్దు ఖచ్చితంగా ఖాయామని ఆర్థికనిపుణుల అంచనా.

Indian Rs. 2,000 notes ban

ఇటీవలె కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నోట్లపై క్లారిటీ ఇచ్చాడు. రూ.1000నోట్లు ఇక తిరిగి వ్యవస్థలోకి తీసుకురావడంలేదని…రాబోయే రోజుల్లో రూ.500నోటు అలాగే ఉంటుందని… ఇక రూ.1000నోట్లు రావు అని వచ్చిన 2000నోట్లు ఉండబోవు అని ఆయన తెలిపారు. వీలైనంతగా 100నోట్లు ప్రింట్‌ చేస్తారు. అది ఒక పరిమితి మేరకే సాధ్యమైనంత తక్కువ కరెన్సీని అందుబాటులో ఉంచారని,… రూ.10,20,50నోట్లపై ఏనిర్ణయం ఉండబోదని జైట్లీ స్పష్టం చేశారు.