అంతర్జాతీయ క్రికెట్‌కు యూవీ గుడ్ బై..!

372
yuvraj
- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడు టీమిండియా సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్. భారత్ తరపున ఇక ఆడబోనని అర్ధం కావడంతో యువీ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. బీసీసీఐ నుండి క్లారిటీ వచ్చాక తన రిటైర్మెంట్ పై అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించనున్నాడు. రిటైర్మెంట్‌ తర్వాత ఐసీసీ అనుమతి పొందిన ఇతర దేశాల్లో టీ20 క్రికెట్‌ ఆడేందుకు యువరాజ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

2011లో భారత్ ప్రపంచకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు యువీ. క్యాన్సర్‌ని జయించి టీమిండియాకు తిరిగి ఎంపికైన యువీ మొదట్లో అవకాశాలు వచ్చినా తర్వాత రిజర్వ్ బెంచ్‌కు పరిమితమయ్యాడు.

40 టెస్టులు ఆడిన యువరాజ్ 1900 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు,11 హాఫ్ సెంచరీలున్నాయి. 304 వన్డేలు ఆడిన యువీ 8701 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు,52 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక 58 టీ20లు ఆడిన యువీ 1177 పరుగులు చేశాడు.ఇందులో 8 హాఫ్ సెంచరీలున్నాయి. 139 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన యువీ 8965 పరుగులు చేయగా ఇందులో 26 సెంచరీలు,36 హాఫ్ సెంచరీలున్నాయి.

టెస్టుల్లో 9,వన్డేల్లో 111,టీ20ల్లో 28,ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో 41 వికెట్లు తీశాడు. టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ యువీ పేరుపైనే ఉంది. 2011 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై 12 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు.

- Advertisement -