విపక్షాల సమావేశం రద్దు-స్టాలిన్‌

187

ఎన్నికల ఫలితాలకు రోజులు సమీపిస్తున్న కొద్దీ దేశరాజకీయాలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో ఏ పార్టీ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని సర్వేలు తేల్చి చెప్తున్నాయి. ఈసారి ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వంలో ప్రాంతీయ పార్టీలు కీ రోల్ పోషించబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా ప్రాంతీయ పార్టీలకు గాలం వేసే పనిలో పడ్డాయి జాతీయ పార్టీలు. నిన్న వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌తో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి.

MK Stalin

నిన్న మొన్నటి వరకు రాహులే ప్రధాని అంటూ చెప్పిన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఈనెల 23న జరిగే ప్రతిపక్షాల భేటీకి హాజరు కావాలని సోనియాగాంధీ నుంచి డీఎంకే అధినేత స్టాలిన్‌కి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే. కాగా మే 23న విపక్షాలతో బేటీ లేదని.. ఇప్పుడు సమావేశం జరపాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఎవరి పక్షాన ఉండేది మే 23 తర్వాతే స్పష్టం చేస్తామనడం చర్చనీయాంశమైంది. ఆయన బీజేపీకి చేరవవుతున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అంతేకాదు సోనియా, రాహుల్‌తో నేడు బీఎస్పీ అధినేత్రి మాయావతి సమావేశం జరగనుండగా ఈ భేటీ కూడా రద్దయినట్లు తెలుస్తోంది. అయితే ఎన్డీయేనే మ‌ళ్లీ అధికారం చేప‌డుతుంద‌ని ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు రావడంతో ప్రాంతీయ పార్టీలు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.