వేణు మృతితో షాకయ్యా: యూసుఫ్ పఠాన్

800
venu madhav
- Advertisement -

టాలీవుడ్ హస్యనటుడు వేణు మాధవ్‌ మృతితో షాక్‌కు గురయ్యానని టీమిండియా క్రికెటర్ యూసుఫ్ పఠాన్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన పఠాన్…వేణు మాధవ్ మరణవార్త విని షాకయ్యానని వెల్లడించారు.

వెండితెరపై తాను చూసిన మంచి హాస్యనటుల్లో వేణుమాధవ్ ఒకరని ..తెలుగు చిత్రసీమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని అన్నాడు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సంప్రదాయం సినిమాతో టాలీవుడ్ ఆరంగేట్రం చేసిన వేణుమాధవ్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. దాదాపు 600కి పైగా సినిమాల్లో నటించిన వేణు..టాలీవుడ్ అగ్రహీరోలందరితో నటించారు. వేణు మృతితో టాలీవుడ్ మూగబోయింది.

- Advertisement -