వీడియోలు తీసి..బ్లాక్‌ మెయిల్ చేసి..భారీ సెక్స్‌రాకెట్‌

831
madhya pradesh sex scam
- Advertisement -

మధ్యప్రదేశ్‌లో భారీ సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. తమ అందాలను ఎరగా వేసి నలుగురు మహిళలు ఆడిన ఆటలో ఎంతో మంది అమాయక యువతులే కాదు… అధికారులు, రాజకీయ నాయకులు కూడా చిక్కుకున్నారు. శృంగార దృశ్యాలను రహస్యంగా రికార్డు చేసి వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న కిలాడీ లేడీలను మధ్యప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు.

వీరి నుంచి 4000 వీడియో, ఆడియో క్లిప్‌లు స్వాధీనం చేసుకోగా ఇందులో ఉన్నవారిని చూసి పోలీసులు షాకయ్యారు. ఒక మాజీ సీఎం, ఒక మాజీ గవర్నర్‌, 13 మంది అధికారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. మధ్యప్రదేశ్‌ నేతలు, అధికారులే కాదు.. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు, అధికారుల రాసలీలలు కూడా ఈ వీడియోల్లో ఉన్నట్టు సమాచారం.

మధ్యప్రదేశ్‌లో ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారగా కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు ఈ సెక్స్ స్కాంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. భోపాల్‌లోని ఓ స్వచ్చంధ సంస్థను అడ్డంపెట్టుకుని సెక్స్ స్కామ్ సూత్రధారి శ్వేతా విజయ్‌జైన్ ఈ భాగోతాన్ని ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా నడిపారు.

బీజేపీ మాజీ సభ్యురాలైన శ్వేతా 2013లో ఆ పార్టీ అభ్యర్ధుల ఎంపిక కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేశారు. తనకున్న రాజకీయ పరిచయాలను అడ్డంపెట్టుకుని సెక్స్ రాకెట్‌ను నడిపించారు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు అమ్మాయిలతో గెస్ట్ హౌసుల్లో ఉన్నప్పుడు… అక్కడ రహస్యంగా స్పై కెమెరాలను పెట్టి వాటిని రికార్డ్ చేయడం శ్వేతా జైన్ గ్యాంగ్ రెగ్యులర్‌గా చేసే పని.

మరో మహిళ శ్వేతా స్వప్నిల్‌ జైన్‌ బీజేపీ ఎమ్మెల్యే బ్రిజేంద్ర ప్రతాప్‌ సింగ్‌ ఇంట్లో ఉంటూనే ఈ సెక్స్‌ స్కాండల్‌ నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని రాజకీయ నాయకులందరితోనూ ఆమెకు సంబంధాలు ఉన్నాయని,  పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే సిట్‌ విచారణకు ఆదేశించిన మధ్యప్రదేశ్‌ సర్కార్‌ ఈ స్కాంలో ఎంత పెద్ద పదవిలో ఉన్నా అధికారులు, రాజకీయ నాయకులైన వదిలే ప్రసక్తేలదేని స్పష్టం చేసింది.

- Advertisement -