క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యూసుఫ్ పఠాన్..

192
Yusuf Pathan
- Advertisement -

భారత మాజీ ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్ అన్ని ఫార్మాట్లకు రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని యూసుఫ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. తనకు ఇంతకాలం మద్దతుగా నిలిచిన కుటుంబం, స్నేహితులు, అభిమానులు, కోచ్ లు, టీములకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పాడు. తన జీవితంలో క్రికెట్ ఇన్నింగ్స్ కు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని యూసుఫ్ తెలిపాడు. భారత్‌కు రెండు ప్రపంచకప్ లను అందించడం, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను తన భుజాల మీద మోయడం రెండూ తనకు చిరస్మరణీయాలని తెలిపాడు.

భారత్‌ తరపున యూసుఫ్ 57 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. 2007 ఐసీసీ టీ20 ప్రపంచకప్, 2011 ఐసీసీ వరల్డ్ కప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టులో యూసుఫ్ పఠాన్ సభ్యుడిగా ఉన్నాడు. వన్డేల్లో 810 పరుగులు, టీ20ల్లో 236 పరుగులు చేశాడు. 46 వికెట్లను పడగొట్టాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన యూసుఫ్… 2012లో దక్షిణాఫ్రికాతో చివరి వన్డేను ఆడాడు. ఐపీఎల్‌లో కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. యూసుఫ్‌.. 2019 ఐపీఎల్‌ సీజ‌న్‌లో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో చివ‌రి రెండు ఐపీఎల్ సీజ‌న్ల వేలాల్లో ఎవ‌రూ అత‌న్ని కొనుగోలు చేయ‌లేదు. దీంతో దేశ‌వాళీ క్రికెట్‌కే ప‌రిమిత‌మైన యూసుఫ్‌.. తాజాగా క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.

- Advertisement -