నాగ చైతన్య ఈసారి డిఫరెంట్ సినిమాను ఎంచుకున్నాడు. ఈ మధ్య కాలంలో తనకు డిఫరెంట్ సినిమాలు కలసి రావట్లేదని మనోడు చక్కగా రొమాంటిక్ కామెడీలూ చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు మాత్రం ”యుద్ధం శరణం” అనే థ్రిల్లర్ సినిమాతో దూసుకొస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైయింది. మూవీలో ”మనం బ్రతకాలంటే.. వాడికి ఎదురెళ్ళాలి. ఇది ధైర్యం కాదు. తెగింపు” అనే లైన్ తో సింగిల్ పాయింట్ లో కథేంటో చెప్పాశాడు చైతు.
”యుద్ధం శరణం” సినిమా ఈ టీజర్లో చక్కగా హ్యాపీగా ఉండే ఒక మిడిల్ క్లాస్ హీరోకు కొంతమందికి ఇబ్బందులు తలెత్తినప్పుడు. తననూ తన వారినీ కాపాడుకోవడానికి అతను ఏం చేశాడన్నదే కథ. టీజర్ చాలా స్టయిలిష్ అండ్ ఫాస్ట్ గా ఉంది. అలాగే చైతన్య లుక్స్. లావణ్య త్రిపాఠి హాట్ ఎప్పియరెన్స్. విలన్ గా హీరో శ్రీకాంత్ చాలా కఠినంగా ఉండటం. ఇక టెక్నాలజీని వాడుతూ అన్నీ కూడా కొత్తగా చూపించాడు డైరెక్టర్.
తమిళ డైరక్టర్ కృష్ణ మరిముత్తు డైరక్షన్‌లో రూపొందిన ఈ టీజర్ కు పెళ్ళి చూపులు ఫేం వివేక్ సాగర్ మ్యూజిక్ అందించాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. సినిమా తాలూకు విజువల్స్ లో డైరక్టర్ పనితనం ఏంటో చెప్పేయవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇది నిజంగా ధైర్యం కాదు తెగింపే. ఒక కొత్త దర్శకుడు ఈ రేంజులో సినిమాను తీశాడంటే ఖచ్చితంగా అతన్ని అభినందించాల్సిందే.
https://youtu.be/U0SrE_kMq2w