తన ప్రమాణస్వీకారానికి రావాలని మోదీని కోరిన జగన్..

163
Jagan Modi

ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ భేటీ ముగిసింది. ఈసమావేశంలో పలు అంశాలను చర్చించినట్లు తెలుస్తుంది. ముందుగా ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలిపారు జగన్. విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలను ఆయన ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.

ఈనెల 30న తన ప్రమాణస్వీకారాణాకి హాజరుకావాల్సిందిగా ప్రధానిని కోరారు జగన్. జగన్‌ వెంట సీఎస్‌ ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పలువురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ప్రధానితో సమావేశం ముగిసాక ఆంధ్రాభవన్‌కు వెళ్లనున్న జగన్‌ అక్కడ ఆంధ్రాక్యాడర్‌ ఐఏఎస్‌ అధికారుతో సమావేశం కానున్నారు.