బాబు వస్తే కరువు వస్తుంది: వైసీపీ ఎంపీ

8
- Advertisement -

చంద్రబాబు, కరువు కవల పిల్లలు అనేది నానుడి అని ఎద్దేవా చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ ఏడాది నైరుతి అనుకూలించినా రాయలసీమలో కరువు నీడలు వెంటాడుతున్నాయని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

ఐదు జిల్లాలలో 54 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి. వైయస్సార్సీపి హయాంలో రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లపాటు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని పక్కన పెట్టి రైతుల ఉసురు తీసుకుంటున్నారు అని మండిపడ్డారు.

- Advertisement -