లోక్ సభ ప్యానల్ స్పీకర్ గా వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి

350
mithun-reddy
- Advertisement -

వైసిపి ఎంపీ మిధున్ రెడ్డికి పార్లమెంట్ లో మరో కీలక పదవి లభించింది. మిధున్ రెడ్డిని లోక సభ ప్యానెల్ స్పీకర్ గా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు స్పీకర్ ఓం బిర్లా. స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లేని సమయంలో ప్యానల్ స్పీకర్ సభకు అధ్యక్షత వహిస్తారు. వైసీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని గతంలో ప్రచారం జరిగింది.

మిధున్ రెడ్డి ప్రస్తుతం పార్లమెంట్ లో వైసీపీ పక్ష నేతగా కొనసాగుతున్నారు.  మిధున్ రెడ్డి కడప జిల్లా రాజంపేట నుంచి ఎంపీగా రెండవ సారి గెలుపొందారు. 2014లో తొలిసారిగా బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిపై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

- Advertisement -