బాలయ్యతో సెల్ఫీ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు..!

439
Balakrihna

సినీ హీరో,టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో వైసీపీ ఎమ్మెల్యేలు సెల్ఫీల కోసం పోటీపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై శాసన మండలి సమావేశాలు ఉత్కంఠగా సాగుతున్న వేళ.. వాటిని తిలకించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఇతర నేతలు వెళ్లారు. అక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది. బాలకృష్ణను చూసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు.

roja

ఇందులో ఎమ్మెల్యే రోజా, కాసు మహేశ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అబ్బయ్య చౌదరి, వసంత కృష్ణప్రసాద్ తదితరులు బాలకృష్ణతో సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత కాసేపు సరదాగా ముచ్చటించారు. బాలయ్యతో సెల్ఫీలకు పోటీ పడడంతో మండలిలో ఒక్కసారిగా సందడి నెలకొంది.