భారీగా తగ్గిన పసిడి ధర..!

473
- Advertisement -

గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర ఈ రోజు దిగొచ్చింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా భారీగా తగ్గింది.అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర స్వల్పంగా పెరిగినప్పటికీ దేశీ మార్కెట్‌లో జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర గురువారం దిగొచ్చింది. రూ.350 పతనమైంది.

gold-price

వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.40,330, విజయవాడలో రూ.40,350, విశాఖపట్నంలో రూ.41,280, ప్రొద్దుటూరులో రూ.40,250, చెన్నైలో రూ.40,040గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,390, విజయవాడలో రూ.37,400, విశాఖపట్నంలో రూ.37,970, ప్రొద్దుటూరులో రూ.37,320, చెన్నైలో రూ.38,130గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.46,000, విజయవాడలో రూ.47,400, విశాఖపట్నంలో రూ.47,400, ప్రొద్దుటూరులో రూ.47,400, చెన్నైలో రూ.50,100 వద్ద ముగిసింది.

- Advertisement -