చంద్రబాబు చీఫ్ ట్రిక్స్ ఎవరూ నమ్మోద్దు: అంబటి రాంబాబు

84
ambati
- Advertisement -

చంద్రబాబు చీఫ్ ట్రిక్స్ ఎవరూ నమ్మవద్దని తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. సీఎం ఎయిర్ పోర్టు లపై సమీక్ష నిర్వహించి..జిల్లా కి ఒక ఎయిర్ పోర్టు ఉండాలని చెప్పారన్నారు. దీనిపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని…గతంలో చంద్రబాబు కూడా జిల్లా కి ఒక ఎయిర్ పోర్టు ఉండాలని చెప్పారన్నారు. అభివృద్ధి ని ఓర్వలేని టిడిపి అసత్య ప్రచారం చేస్తోందన్నారు. అభివృద్ధి ని చూసి చంద్రబాబు కు ఏడవాలో..నవ్వాలో తెలియడం లేదన్నారు. గోవా కల్చర్ ని గుడివాడ తెచ్చారని మాట్లాడుతూ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు…..క్యాసినో, కోడి పందేలు జరిగాయని అంటున్నారు..నిజ నిర్దారణ పేరుతో గుడివాడ మీద ప్రేమ..కొడాలి నాని మీద కక్ష..తోనే ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించారు.

మిమ్మల్ని రోజూ విమర్శిస్తున్నాడని.. తొక్కేద్దా మని ప్రయత్నమా అన్నారు. టిడిపి నానా యాగీ చేస్తోంది..365 రోజులు మాగంటి బాబు క్లబ్ లు నడిపి ,పేకాట ఆడించారన్నారు. గురజాల లో యరపతనేని పేకాట ఆడించాడని…రామోజీ ఫిల్మ్ సిటీలో బెల్లి డాన్స్ లు జరిగాయన్నారు.365 రోజులు జరుగుతున్నాయి.. రామోజీ రావు ను నిలదీయండన్నారు. ఇది తెలుగు సంస్కృతా..?సంస్కృతి గురించి మాట్లాడే వారు దీని గురించి ఎందుకు మాట్లాడరన్నారు.

కరోనా వచ్చి కొడాలి నాని హాస్పిటల్ లో ఉన్నాడు..ఆ మూడు రోజులు ఎవరో డాన్స్ లు,కోడి పందేలు వేస్తే పట్టుకోవాలిసిందేనన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాట క్లబ్ లు మూసి వేయించామన్నారు. సంక్రాంతి మూడు రోజులు వేరు..365 రోజులు వేరు అన్నారు.
ఏదో ఎక్కడో జరిగితే కొడాలి నాని కి అంటగడుతున్నారు…పండగ సందర్భంగా ఏదయినా జరిగితే చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. కొడాలి నాని పై కక్ష ఉంటే.. తేల్చుకుందాం..జగన్, వైసీపీ, కొడాలి నాని పై పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారన్నారు.

- Advertisement -