వైసిపి మేనిఫెస్టో విడుదల..ముఖ్యమైన హామిలు ఇవే

518
Ysrcp Manifestio
- Advertisement -

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు ఆపార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ఆయన మేనిఫెస్టోని విడుదల చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, ఉజ్వల భవిష్యత్తు లక్ష్యంగా వైసీపీ మేనిఫెస్టోను రూపొందించామన్నారు జగన్. 2014లో చంద్రబాబు తమ మేనిఫెస్టోలో 650 హామీలిచ్చారని, ఇప్పుడు టీడీపీ వెబ్‌సైట్‌లో ఆ మేనిఫెస్టో ఎక్కడా కనిపించట్లేదన్నారు. మేనిఫెస్టో లో పెట్టిన అంశాలను చేసి చూపించి ప్రజలను ఓట్లను అడిగే పరిస్థితి రావాలని అన్నారు.

మేనిఫెస్టో ముఖ్యాంశాలు…

  • ప్రతి రైతు కుటుంబానికీ పెట్టుబడి కోసం రూ. 50 వేలు.
  • పంట వేసే సమయానికే మే నెలలో రూ. 12,500.
  • పంట బీమా కోసం చెల్లించాల్సిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది.
  • ఉచిత బోర్లు, పగటి పూట 9 గంటల కరెంట్, ఆక్వా రైతులకు యూనిట్ రూ. 1.50కే విద్యుత్.
  • రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.
  • పంట వేసే ముందే రేటు, గిట్టుబాటు ధరకు గ్యారంటీ.
  • రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తు నిధి.
  • ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగి.
  • రెండో ఏడాది నుంచి సహకార రైతుకు పాలు ఇచ్చే పాడి రైతుకు లీటరుకు రూ. 4 బోనస్.
  • ప్రమాదమైనా, ఆత్మహత్య అయినా రూ. 7 లక్షల బీమా.
  • ఆ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టం.
  • కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు. పంటకు సంబంధించిన రాయితీలు, ప్రయోజనాలు.
  • వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ అమలు.
  • అన్ని వర్గాలకూ వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే పథకం అమలు.
  • ఎన్ని లక్షలు ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది.
  • ఏ ప్రాంతంలో చికిత్స చేయించుకున్నా ఉచితమే.
  • చికిత్స తరువాత కోలుకునేంత వరకూ కుటుంబానికి సాయం.
  • పిల్లల చదువులన్నీ ఉచితం.
  • బిడ్డను బడికి పంపే తల్లికి సంవత్సరానికి రూ. 15 వేలు.
  • పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు వసతి కోసం విద్యార్థికి ఏటా రూ. 20 వేలు.
  • పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గింపు.
  • వికలాంగులకు, వృద్ధులకు రూ. 3 వేల పెన్షన్.
  • ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు.
  • స్థలం లేని వారికి ఉచిత స్థలం. మహిళల పేరిట రిజిస్ట్రేషన్.
  • ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ అలుపెరగని పోరు.
  • ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు.
  • 50 ఇళ్లకు ఒకరి చొప్పున నెలకు రూ. 5 వేల గౌరవ వేతనంతో వాలంటీర్ల నియామకం.
  • అన్ని ప్రభుత్వ పథకాలనూ ఇంటి వద్దకే చేరుస్తాం.
  • ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటు
  • గవర్నమెంట్ కాంట్రాక్టులు నిరుద్యోగ యువతకు ఇచ్చేలా చట్ట సవరణ.
  • సబ్సిడీపై యువతకు కావాల్సిన మౌలిక వసతులు.
  • వైఎస్ఆర్ ఆసరా ద్వారా మహిళల రుణాలు దశలవారీగా మాఫీ
  • మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు.
  • మూడు దశల్లో మద్యపాన నిషేధం.
  • మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ కు మాత్రమే పరిమితం చేస్తాం.
  • అగ్రీ గోల్డ్ బాధితులకు రూ. 1100 కోట్ల కేటాయింపు.
  • తిరుమల శ్రీవారి ఆలయం తలుపులను సన్నిధి గొల్లలు తెరిచే సంప్రదాయ పునరుద్ధరణ.
  • సొంత ఆటో, టాక్సీ నడిపేవారికి సంవత్సరానికి రూ. 10 వేలు.
  • 18 నుంచి 60 ఏళ్ల వయసువారికి రూ. లక్ష బీమా
  • సహజమరణమైనా కుటుంబానికి ఆ డబ్బు చెల్లిస్తాం.
  • ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు పారదర్శకంగా ఉండేలా చూస్తాం.
  • ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తాండాల్లో ఏడాదికి 2 వేల యూనిట్ల ఉచిత కరెంట్ లేదా రూ. 6 వేలు.
- Advertisement -