ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది వైసీపీ బృందం. కేంద్ర ఎన్నికల సంఘం మమ్మల్ని ఆహ్వానించింది.. ఓటర్ లిస్ట్, పోలింగ్ సరళిపై చర్చలు జరిగాయి అన్నారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి. 2024 ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి.. వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది అని తెలిపారు.
కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎం ఓట్లు, వీవీ ప్యాట్‍లు పోల్చి చూడాలి.. ఈవీఎం బ్యాటరీలపై కూడా సందేహాలు ఉన్నాయి.. ఏపీలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరిగింది అన్నారు. సా.6 తర్వాత దాదాపు 50 లక్షల ఓట్లు పోలయ్యాయ్యాయి, విచారణ చేయాలి అని తెలిపారు.
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ బూత్ నెంబర్ 157, 28వ పోలింగ్ బూత్ ల్లో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులకు భిన్నమైన పోలింగ్ నమోదు అయ్యింది. 28 వ బూత్‌లో వైయస్ఆర్‌సీపీ పార్లమెంట్ అభ్యర్ధికి 472 ఓట్లు వస్తే, అసెంబ్లీ అభ్యర్థికి కేవలం 1 ఓటు మాత్రమే వచ్చింది. అలాగే రాష్ట్రంలో నామమాత్రంగా ప్రభావం చూపించే కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ అభ్యర్థికి 1 ఓటు వస్తే, అసెంబ్లీ అభ్యర్థికి 464 ఓట్లు వచ్చాయి అని తెలిపారు.
Also Read:శ్రీలీల-కార్తిక్…ఈసారి కేఫేలో!
వీవీ ప్యాట్ లను లెక్కించేది లేదని చెబుతున్నారు. కనీసం సీసీ ఫుటేజీ అడిగినా ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. మా మార్గదర్శకాలు ఇలాగే ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ఈ అనుమానాలను తొలగించేందుకు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని కోరామని సుబ్బారెడ్డి వెల్లడించారు.

