- Advertisement -
హీరోయిన్ శ్రీలీల ఇటీవల తన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ సోషల్ మీడియా ద్వారా సరదాగా చెప్పిన పుట్టినరోజు శుభాకాంక్షలు, వారి మధ్య ఉన్న రిలేషన్ షిప్‌పై వార్తలు జోరందుకున్నాయి.
తాజాగా నిన్న రాత్రి ముంబైలోని ఓ కేఫే నుండి శ్రీలీల, కార్తిక్ ఆర్యన్ కనిపించడంతో మళ్లీ ఆ వార్తలకు బలం చేకూరింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం వీరిద్దరూ అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా కోసం కలిసి పనిచేస్తున్నారు. శ్రీలీల నటించిన జూనియర్.. 2025 జూలై 18న థియేటర్లలో విడుదల కానుంది.వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీను చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
Also Read:వీరమల్లు..ట్రైలర్ టాక్!
- Advertisement -

