పోసాని కృష్ణమురళి అరెస్టును తీవ్రంగా ఖండించారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే పోసానిని అరెస్ట్ చేశారన్నారు. రేపటి డేట్ తో పోసానికి నోటీసులు జారీ చేయడం వెనుక పోలీసుల అత్యుత్సాహం కనిపిస్తోందన్నారు.
కక్ష సాధింపు రాజకీయాలపై అసెంబ్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారని.. చంద్రబాబు తప్పిదాలను విమర్శించిన పోసాని కృష్ణమురళిపై నాన్ బెయిలబుల్ కేసులు దుర్మార్గం అన్నారు.
రాయదుర్గంలోని మైహోం భుజ అపార్ట్‌మెంట్‌లో పోసానిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో క్రైమ్ నంబర్ 65/2025 అండర్ సెక్షన్ 196, 353(2),111 రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ యాక్ట్ 2033 నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు పోసాని.
Also Read:ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి

