వివేకా కేసు బిగ్ ట్విస్ట్.. నెక్స్ట్ జగనే !

89
jagan
- Advertisement -

2019 ఎన్నికల ముందు ఏపీలో వైఎస్ వివికానంద రెడ్డి హత్య ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు హత్య జరగడంతో అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతలే హత్య చేశారని వైసీపీ.. కాదు కాదు వైసీపీ వాళ్ళే హత్య చేశారని టీడీపీ ఇలా ఒకరిపై ఒకరు గట్టిగానే ఆరోపణలు చేసుకున్నారు. మొత్తానికి హత్య జరిగి నాలుగేళ్ళు కావొస్తున్న ఇప్పటివరకు ఎవరూ చేశారనేది మిస్టరీగానే ఉంది. 2019లో ఈ కేసు నిమిత్తం అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేయగా, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మరో టీమ్ ను ఏర్పాటు చేశారు. అయినప్పటికి కేసు మాత్రం ముందుకు సాగలేదు.

ఇక వివేకా హత్య కేసులో మొదటి నుంచి కూడా వైఎస్ అవినాష్ రెడ్డి పేరు గట్టిగానే వినిపిస్తోంది. అయితే నిందితులను బహిర్గతం చేయకుండా జగన్ ప్రభుత్వం సాక్షులను అడ్డుకుంటోందంటూ ఆ మద్య ఏపీ సీబీఐ కోర్టు ముందు నివేధించడంతో ఈ కేసును తెలంగాణ సీబీఐకి బదలి చేసింది దర్మాసనం. ఆ తరువాత కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. 24వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొంది. నోటీసులపై స్పందించిన అవినాష్ రెడ్డి విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని, అయితే నోటీసులు కేవలం ఒక్కరోజు ముందుగా తనకు జారీ చేశారని, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలకు తాను హాజరు కావాల్సి ఉన్నందున మంగళవారం విచారణకు హాజరు కాలేనంటూ అవినాష్ రెడ్డి సీబీఐకి లేక రాశారు.

మొత్తానికి వివేకా హత్య కేసులో ఎప్పటి నుంచి ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ కావడంతో ఈ అంశం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అయితే వివేకా హత్య వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ టీడీపీ నేతలు మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తాన బాబాయ్ హత్య విషయంలో పెద్దగా స్పందించలేదు. అంతే కాకుండా నిందితులకు జగన్ అండగా ఉన్నారనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ కావడంతో.. నెక్స్ట్ జగనే అంటూ టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. మరి మిస్టరీగా ఉన్న వివేకా హత్య కేసు మున్ముందు రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

 

- Advertisement -