కలిసిన ఇద్దరు చెల్లెళ్ళు..జగనన్నకు చుక్కలేనా?

25
- Advertisement -

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైయస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎవరు కాదన్నా అవునన్నా వైసీపీలో అంతర్మాదనం మొదలైంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపులో ముఖ్యపాత్ర వహించిన షర్మిల ఇప్పుడు అదే పార్టీని ఓడించేందుకు రెడీ కావడం వైయస్ జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేని అంశంగా మారింది. ఇది చాలదన్నట్లుగా దివంగత నేత వైయస్ వివేకా కూతురు వైయస్ సునీత కూడా షర్మిల పక్షాన చేరడంతో ములిగే నక్కపై తాటికాయ పడ్డట్లయింది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఎందుకంటే గత ఎన్నికల ముందు జరిగిన వివేకా హత్య కేసు ఇప్పటికే మిస్టరీగానే ఉంది. ఈ కేసు విషయంలో వైఎస్ సునీత జగన్ ప్రభుత్వంతో మొదటినుంచి విభేదిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు వైయస్ సునీత, వైయస్ షర్మిల ఒక్కటై జగన్ ప్రభుత్వానికి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తుండడం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఇటీవల షర్మిల తో వైయస్ సునీత భేటీ అయిన సంగతి తెలిసిందే. ఒకవేళ సునీత షర్మిల కోరిక మేరకు కాంగ్రెస్ లో చేరితే కడప లోక్ సభ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వినికిడి. అటు షర్మిల కూడా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగే ఛాన్స్ ఉన్నట్లు టాక్. ఇలా ఇద్దరు చెల్లెలు అన్నయ్య జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పావులు కదుపుతుండడంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల్లో వైసీపీకి టీడీపీ జనసేన పార్టీలతో ప్రధాన పోటీ ఉన్నప్పటికీ.. జగన్మోహన్ రెడ్డికి మాత్రం కుటుంబసభ్యులతోనే ప్రధాన పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఫ్యామిలీ వార్ ఏపీ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.

Also Read:Harishrao:ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు?

- Advertisement -