అందరూ ఊహించినట్లుగానే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితం అయింది. ఆమె ఎంట్రీతో ఏపీ రాజకీయాలు ఎలా టర్న్ అవ్వబోతున్నాయనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. మరో రెండు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో షర్మిల పోటీ చేసే స్థానంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తుంటే.. ఆమె పోటీ కారణంగా ఆ ప్రభావం వైఎస్ జగన్ పై ఎలా ఉండబోతుందనేది మరింత ఆసక్తి రేపుతున్న అంశం. ఏపీలో జగన్ సర్కార్ పై అనుకూలత, ప్రతికూలత సమపాళ్ళలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తన అన్న పాలనపై షర్మిల ఎలాంటి విమర్శలు చేసిన పోలిటికల్ హీట్ పెరగడం ఖాయం. ఇసుక కుంభకోణం, ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు, అధిక పన్నుల భారం, రాష్ట్రంపై అప్పు భారం.. ఇలా చాలా అంశాలపైనే వైఎస్ జగన్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. .
ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఎలాంటి విమర్శలు చేసిన ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో వైసీపీపై గట్టిగానే పడే అవకాశం ఉంది. ఇకపోతే షర్మిల పోటీ చేసే స్థానంపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆమె జగన్ కు పోటీగా పులివెందుల అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం టాక్. అదే గనుక జరిగితే జగన్ ఓటు బ్యాంకు భారీగా దెబ్బతినే అవకాశం ఉంది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే కడప లోక్ సభ స్థానానికి షర్మిల పోటీ చేసే అవకాశం ఉందట.. ఈ రెండిట్లో ఏ విధంగా పోటీ చేసిన ఆ ప్రభావం జగన్ పై.. వైసీపీపై గట్టిగానే పడే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ నేతలు షర్మిల టార్గెట్ గా విమర్శలు ఎక్కుబేడుతున్నారు. ఇక ముందు రోజుల్లో తన అన్న లక్ష్యంగా షర్మిల చేసే విమర్శలకు వైసీపీ నేతలు ఎలా సమాధానం చెబుతారో చూడాలి.
Also Read:తెలంగాణలో గోద్రెజ్ రూ.1000 పెట్టుబడులు