Sharmila:కడప బరిలో షర్మిల..జగన్ కు బిగ్ షాక్!

30
- Advertisement -

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేసే స్థానంపై గత కొన్నాళ్లుగా సస్పెన్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా ? లేదా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తారా ? అనే దానిపై రకరకాల వాదనలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఆమె పోటీ చేసే స్థానంపై క్లారిటీ వచ్చింది. ఆమె కడప లోక్ సభ స్థానానికి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో సీట్ల కేటాయింపుపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ కొంతమంది సీట్లు కన్ఫర్మ్ చేసింది. కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కాకినాడ నుంచి పల్లంరాజు, విశాఖ నుంచి సినీ నిర్మాత సత్యారెడ్డి వంటి వారిని ఫైనల్ చేసినట్లు సమాచారం.

అయితే మిగిలిన స్థానాల సంగతి అటుంచితే షర్మిలకు కడప పార్లమెంట్ సీటు కేటాయించడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎందుకంటే కడప పార్లమెంట్ సెగ్మెంట్ వైసీపీ కుటుంబానికి అడ్డాగా ఉంటూ వస్తోంది. గత కొన్నేళ్లుగా వైఎస్ కుటుంబీకులే ఈ స్థానంలో గెలుస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల ముందు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య గావించబడ్డ తర్వాత కడప ఎంపీ సీటును వైసీపీ తరుపున వైఎస్ అవినాష్ రెడ్డికి కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. అయితే వివేకా హత్యలో ప్రధాన నిందితుడిగా అవినాష్ రెడ్డి పేరు పదే పదే వినిపిస్తూ వస్తోంది.

పైగా ఈ సారి ఎన్నికల్లో కూడా అవినాష్ రెడ్డికే కడప ఎంపీ సీటు కేటాయించడంతో వివేకా మర్డర్ ఎఫెక్ట్ ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు షర్మిల కూడా కడప పార్లమెంట్ సీటు నుంచే పోటీ చేయనుండడంతో ఈ సెగ్మెంట్ తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అయితే గెలుపోటముల సంగతి పక్కన పెడితే షర్మిల కడప నుంచి పోటీ చేయడం వైసీపీకి గట్టి దెబ్బే అనేది కొందరి విశ్లేషకులు చెబుతున్న మాట. కడపలో షర్మిల ఏ మాత్రం గెలిచిన అవినాష్ రెడ్డి పై కంటే జగన్ పైనే విజయం సాధించినట్లు అవుతుందనేది రాజకీయ వాదుల అభిప్రాయం.

Also Read:Niranjan:తీవ్ర ఇబ్బందుల్లో రైతులు..

- Advertisement -