షర్మిల కండిషన్స్.. పాలేరు కోసమే?

44
- Advertisement -

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గత కొన్నాళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో సైలెంట్ గా వ్యవహరిస్తోంది. దీనికి కారణం ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తుండడమే. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతుందని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే ఆ వార్తాలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. పార్టీ విలీన ప్రక్రియ మొత్తం డికె శివకుమార్ నేతృత్వంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు డికేతో భేటీ అయిన షర్మిల తాజాగా కూడా మరోసారి భేటీ అయింది. ఇక కాంగ్రెస్ హైకమాండ్ ను కలవడమే తరువాయి. కాగా షర్మిల రాకను కాంగ్రెస్ కూడా స్వాగతిస్తోంది.

ఎందుకంటే తెలంగాణలో గెలుపే లక్ష్యంగా ఉన్న హస్తం పార్టీకి షర్మిల ఎంతో కొంత హెల్ప్ అయ్యే అవకాశం ఉందని హస్తం హైకమాండ్ భావిస్తోంది. అయితే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలంటే కొన్ని కండిషన్స్ ను హైకమాండ్ ముందు ఉంచే ప్లాన్ లో ఉందట షర్మిల. ముఖ్యంగా పాలేరు సీటును తనకు కేటాయించాలని షర్మిల డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తన పార్టీ నుంచి పోటీ చేసిన ఆమె పాలేరు నుంచి పోటీ చేయాలని భావించారు.

Also Read:ప్రోటీన్ల కోసం ఇవి తినండి…

అందుకే ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన అదే సీటు ను ఆమె కోరుకునే అవకాశం ఉంది. ఇక తన పార్టీలోని కొంతమంది అభ్యర్థులకు తాను కోరుకునే కొన్ని సీట్లు కేటాయించాలనే కండిషన్ కూడా పెట్టబోతున్నట్లు టాక్. మరి ఈ కండిషన్స్ కు అధిష్టానం ఎంతవరకు ఆమోదం తెలుపుతుందో చూడాలి. అసలు టి కాంగ్రెస్ కు షర్మిల అవసరత లేదని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో షర్మిలా కండిషన్స్ పెడితే.. వాటికి ఆమోదం దక్కడం కష్టమే అనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ రాజకీయాల వైపు వెళ్లడానికి ఆమె సిద్దమైతే.. ఏపీ కాంగ్రెస్ బాధ్యత మొత్తం షర్మిల భుజాన పడే అవకాశం ఉంది. మరి షర్మిల కండిషన్స్ కు హస్తం హైకమాండ్ ఒకే అంటుందా లేదా అనేది చూడాలి.

Also Read:యువతే టార్గెట్‌గా బీజేపీ ప్లాన్?

- Advertisement -