- Advertisement -
ఎక్స్ వేదికగా ప్రధాని మోదీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోదీ అభినవ గాడ్సే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆనాడు గాడ్సే మహాత్ముని భౌతికంగా హత్య చేస్తే, నేడు బాపుజీ పేరు తొలగించి గాంధీజీ ఆశయాలను, స్వాతంత్ర్యపు లక్ష్యాలను, నేర్పిన సిద్ధాంతాలను తుడిచి పెట్టి మోదీ మరో హత్య చేస్తున్నారు… ఉపాధి హామీ పథకానికి జాతిపిత పేరు మార్చాలని చూడటం దేశ ద్రోహం అన్నారు.
MGNREGA పథకానికి ఉన్నపళంగా పేరు మార్చాల్సిన అవసరం ఏమిటి ? ,స్వాతంత్ర్య సమరయోధుల మీద, మాజీ ప్రధానుల మీద బీజేపీకి ఎందుకంత కోపం? , దేశం మొత్తం మోడీ గారి తీరును ప్రతిఘటించాలి.. రాష్ట్ర ఎంపీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలి అన్నారు.

Also Read:కాంగ్రెస్ గుండాగిరిపై కేటీఆర్ కన్నెర్ర..
- Advertisement -

