చంద్రబాబు,జగన్‌కు తేడా లేదు!

5
- Advertisement -

చంద్రబాబు, జగన్ ఇద్దరికీ తేడా లేదు అన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేస్తే పులివెందులలో చంద్రబాబు అదే చేశారు… ఇద్దరు కలిసి ఎన్నికల్లో ప్రజాస్వామాన్ని ఖూనీ చేశారు అన్నారు.

ఇద్దరు కలిసి మోడీ కోసం పని చేస్తున్న వాళ్లే… ఒకరిది బహిరంగ పొత్తు, మరొకరిది అక్రమ పొత్తు అన్నారు. ఓటు చోరీపై మోదీకి చంద్రబాబు, జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదు… ప్రజాస్వామ్యం బ్రతకాలంటే దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అన్నారు.

నయా భారత్ కాదు.. మోడీ చేతిలో దగా పడ్డ భారత్…. మోడీ చెర నుంచి దేశాన్ని విడిపించే మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సి ఉంది అన్నారు. దేశాన్ని కార్పొరేట్లకు దాచిపెట్టి, RSS రాజ్యాగాన్ని అమలు చేయడమా నయా భారత్ అంటే ? అని దుయ్యబట్టారు.

Also Read:కులం,మతం కాదు..భారతీయత ఒక్కటే

- Advertisement -