బాలికపై హత్యాచారం..రెండు ఉరిశిక్షలు!

9
- Advertisement -

బాలికపై హత్యాచారం కేసులో నిందితుడికి 12 ఏళ్ల తర్వాత రెండు ఉరిశిక్షలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది నల్గొండ కోర్టు. నిందితుడికి రెండు ఉరిశిక్షలు, రూ.1.10 లక్షలు జరిమానా.. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

నిందితుడికి జైలు శిక్ష విధించింది పొక్సో కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి రోజా రమణి. 2013లో నల్గొండకి చెందిన 12 ఏళ్ల బాలికపై హత్యాచారం చేశాడు నిందితుడు. నిందితుడు నల్గొండకు చెందిన మోహమ్మీ ముకర్రం. ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి.. మృతదేహాన్ని మురికి కాల్వలో పడేశాడు నిందితుడు.

బాలిక కనిపించడం లేదని నల్గొండ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబసభ్యులు. నిందితుడిపై పొక్సో, హత్య నేరం కేసు నమోదు చేశారు. పదేళ్లుగా నల్గొండ జిల్లా కోర్టులో వాదనలు నడుస్తుండగా హత్య చేసినందుకు దోషి మహ్మద్ ముకర్రంకు ఐపీసీ ప్రకారం ఉరిశిక్ష రూ.50 వేల జరిమానా, అలాగే అత్యాచారం చేసినందుకు పోక్సో చట్టం ప్రకారం ఉరిశిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది. ఆధారాలు నాశనం చేసినందుకు ఐపీసీ చట్టం ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది కోర్టు.తీర్పు పై హర్షం వ్యక్తం చేశారు బాలిక కుటుంబ సభ్యులు.

Also Read:కులం,మతం కాదు..భారతీయత ఒక్కటే

- Advertisement -